ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ "MNV" నుండి క్రేజీ డ్యుయో ఇంట్రడక్షన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 06:55 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న మేకర్స్ ఇదివరకు నితిన్ ను ఢీ కొట్టే పవర్ఫుల్ "రాజప్ప" ఫస్ట్ లుక్ ను, గుంతలకడి గురునాథం (గురు) క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ రెంటికీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి క్రేజీ డ్యుయో ను ఇంట్రడ్యూస్ చేసారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ను సురేందర్ గా, మురళీశర్మను నరేందర్ గా పరిచయం చేసారు. చూస్తుంటే, వీరిద్దరూ సినిమాలో అన్నదమ్ములుగా నటించినట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa