ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప డిస్కషన్స్ లో పాల్గొనేంత స్థాయి నాకు లేదు, రాదు - బుచ్చిబాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 06:48 PM

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి, తర్వాత టాలీవుడ్ సత్తా చాటిన సినిమా "పుష్ప". సుకుమార్ డైరెక్షన్లో శాండల్ మాఫియా నేపథ్యంలో, పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పుష్ప లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. పుష్ప సినిమాతో పాటుగా పాటలు కూడా నేషన్ వైడ్ పాపులర్ అయ్యాయి. ప్రస్తుతానికి ప్రేక్షకులందరూ పుష్ప సీక్వెల్ కోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. 
లేటెస్ట్ గా మైత్రి ఆఫీస్ లో జరిగిన పుష్ప డిస్కషన్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట హల్చల్ చేసాయి. పుష్ప డిస్కషన్స్ లో సుకుమార్ శిష్యుడు, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పాల్గొన్నాడని, శిష్యుడు సహాయాన్ని గురువు కోరుతున్నాడని,,, ఇలా పలురకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతుండగా, స్వయంగా బుచ్చిబాబు ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. నిజానికి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో సుకుమార్ సహాయం తనకు సహాయం చేసేందుకు వచ్చారని, పుష్ప డిస్కషన్స్ లో భాగమయ్యే రేంజ్ తనకు లేదని, గురువుకు పాఠాలు నేర్పే స్థాయి తనది కాదని పేర్కొంటూ ట్వీట్ చేసారు. సుకుమార్ నుండి నేర్చుకోవడం, తీసుకోవడం తప్ప ఆయనకు ఇచ్చేంత స్థాయి తనకు లేదని చెప్తూ పుష్ప లో తనకు ఎలాంటి భాగం లేదని క్లియర్ కట్ గా చెప్పేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa