తెలుగు తెరపై విలేజ్ నేపథ్యంతో కూడిన విలనిజాన్ని తనదైన శైలిలో పరిగెత్తించిన నటుడు నర్రా వెంకటేశ్వరరావు. అలాంటి నర్రా వెంకటేశ్వరావు గురించిన విషయాలను తాజాగా ఆయన కూతురు వసంత మాట్లాడుతూ .. "నాన్నగారికి నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే రోజులలోనే ఆయన నాటకాలు వేసేవారట. టి. కృష్ణగారు .. నాన్నగారు ఒకే కాలేజ్ లో చదువుకున్నారు .. ఇద్దరూ మంచి స్నేహితులు. నాన్నగారు టి.కృష్ణగారి సినిమాలతో పాప్యులర్ అయ్యారు. అందువలన కెరియర్ ఆరంభంలో అవకాశాల కోసం ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. తనకి వచ్చిన పాత్రలో మెప్పించడం గురించి మాత్రమే ఆలోచన చేసేవారు" అని అన్నారు. "నాన్నగారు వరుస సినిమాలు చేస్తూ వెళ్లేవారు. అయినా ఫ్యామిలీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేవారు. సినిమాల గురించిన విషయాలను ఇంట్లో అస్సలు ప్రస్తావించేవారు కాదు. ఆయనకి ఇష్టమైన హీరో మాత్రం శోభన్ బాబు అని మాకు అర్థమైంది. శోభన్ బాబుగారి సలహాతోనే భూములను ఎక్కువగా కొంటూ వెళ్లారు. డబ్బు - సమయం విషయంలో ఆయన ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవారు. ఈ రోజున మేము ఏ ఇబ్బందీ లేకుండా ఉండటానికి కారణం, ఆయన ముందు చూపేనని అనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa