కుంభమేళాలో గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే అది ప్రస్తుతం కొత్త వివాదానికి దారితీసింది. తమ అమ్మాయిని కేరళలోని అత్తింటివారు మోసగించి, వలలో వేసుకుని పెళ్లి చేసుకున్నారని ఆమె బంధువు విజయ్ భోస్లే సంచలన ఆరోపణలు చేశారు. ఈ మతాంతర వివాహం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.మా కులంలో, సమాజంలో ఇలాంటివి ఇష్టపడరు. కేరళ వాళ్లు చేసింది చాలా తప్పు. కుంభమేళా తర్వాత మా అమ్మాయి వైరల్ అయింది. దీన్ని అవకాశంగా తీసుకుని, 'మీ ఊరిలో నటన నేర్పేవాళ్లు లేరు కదా, కేరళకు రండి, మేం బాగా చదివిస్తాం, మంచి నటన నేర్పిస్తాం, రీల్స్ చేద్దాం' అని ఆమె తండ్రికి చెప్పారు" అని వివరించారు."ఆ మాటలు నమ్మి నటన నేర్చుకోవచ్చని మా అమ్మాయి కేరళ వెళ్లింది. ఆమె చాలా అమాయకురాలు. అక్కడివాళ్లు ఆమెను ట్రాప్ చేశారు. నాలుగైదు రోజులు మంచి ప్రదేశాలకు తిప్పి, అక్కడి అందమైన లొకేషన్లు చూపించారు. ఆమెకు బ్రెయిన్ వాష్ చేశారు. ఇంతలో మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి, ఇంటికి రమ్మని పిలిచాం. కానీ వాళ్లు మమ్మల్ని మోసం చేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ అబ్బాయి వాళ్ల భాషలో పోలీసులతో ఏదో మాట్లాడాడు" అని విజయ్ భోస్లే తెలిపారు.పోలీసులు తమను పిలిచి, మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయని, ఆమె మీతో రావడానికి ఇష్టపడటం లేదని చెప్పారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa