ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుల్లితెరపైనా సైతం సత్తా చాటిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:47 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం వెండితెరపై సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అదే జోరును బుల్లితెరపైనా ప్రదర్శించి తన క్రేజ్‌కు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఇటీవల జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 28న ప్రసారమైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ భారీ రేటింగ్, మెగాస్టార్ స్టామినా కేవలం థియేటర్లకే పరిమితం కాదని, బుల్లితెరపైనా చెక్కుచెదరలేదని స్పష్టం చేసింది.ఈ భారీ విజయంపై దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్లలో చూపిన ప్రేమను, బుల్లితెరపై కూడా చూపించి ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa