ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇరుముడి'లో జోడీగా రవితేజ-తమన్నా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 02:33 PM

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇరుముడి' సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇంతకుముందు 'బెంగాల్ టైగర్' సినిమాలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. తమన్నాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉండటంతో, ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే సినిమాకు అదనపు బలం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa