నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తిసురేశ్, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్ వంటి తారలు తెలుగు నేర్చుకుని, తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తాజాగా, సంయుక్త మీనన్ కూడా ఈ జాబితాలో చేరారు. 'విరూపాక్ష' సినిమా సమయంలో తెలుగు నేర్చుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, ట్యూటర్ల సహాయంతో త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు తెలుగు తన మాతృభాషలా మారిందని, ఇకపై తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ఆమె సంతోషంగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa