అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' సినిమా విడుదల తేదీని మరోసారి వాయిదా వేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో క్రిస్మస్, ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో విడుదల కావాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో శార్వరీ వాఘ్, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న తొలి మహిళా స్పై యాక్షన్ మూవీ కావడంతో అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa