తెలుగు నటి ఈషా రెబ్బా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు తన ఫోటోలను జూమ్ చేసి మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలని కోరారని, ఆ మాటలు తనను బాధించాయని తెలిపారు. తన పుట్టుకతో వచ్చిన రంగును మార్చుకోలేనని, అయితే పరిశ్రమలో ఇలాంటివి జరుగుతుంటాయని అప్పట్లో తెలియదని, ఆ వ్యాఖ్యలతో తాను కూడా మరింత కలర్‌గా ఉంటే బాగుండేదేమో అనిపించిందని, కానీ వారి కోసం తన రంగును మార్చుకోలేనని, ఆ సమయం నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం నేర్చుకున్నానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa