ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Hotstar Lover Alert: సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే జనవరి 28 చే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 10:53 PM

దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరుగనున్నట్లు ఇటీవల లీకులు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం జూన్‌లో 15–20 శాతం వరకు టారిఫ్‌లు పెరగే అవకాశం ఉంది. చివరిసారి ఈ మార్పు 2024లో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థల్లో జరిగింది. ఇక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇంకా ప్లాన్‌లలో మార్పు చేయలేదు.
*కొత్త ధరలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? జియో హాట్‌స్టార్ (JioHotstar) కీలక ప్రకటన చేసింది. సూపర్ మరియు ప్రీమియం ప్లాన్‌లలోనే ధరల్లో మార్పులు చేసినట్లు, ఈ కొత్త ధరలు కేవలం కొత్త యూజర్లకు వర్తిస్తాయని తెలిపింది. ఈ ధరలు జనవరి 28 నుండి అమల్లోకి రానున్నాయి.
-రూ.79 రీఛార్జ్ ప్లాన్ : జియో హాట్‌స్టార్ రూ.79 నెలవారీ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది కేవలం మొబైల్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు నెలల ప్లాన్ ధర రూ.149, వార్షిక ప్లాన్ ధర రూ.499. ఈ ప్లాన్‌లో ఒకసారి ఒకే మొబైల్‌లో సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించవచ్చు.
-సూపర్ ప్లాన్‌లు : సూపర్ ప్లాన్‌లో నెలవారీ రీఛార్జ్ రూ.149, మూడు నెలల ప్లాన్ రూ.349, వార్షిక ప్లాన్ రూ.1099. ఈ ప్లాన్‌లో ఒకేసారి రెండు డివైజ్‌లలో కంటెంట్ వీక్షించవచ్చు. మొబైల్, వెబ్ సహా అన్ని రకాల కంటెంట్ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
-ప్రీమియం ప్లాన్‌లు : ప్రీమియం నెలవారీ రీఛార్జ్ ప్లాన్ రూ.299, మూడు నెలల ప్లాన్ రూ.699, వార్షిక ప్లాన్ రూ.2199. ఈ ప్లాన్‌లో గరిష్టంగా 4 డివైజ్‌లలో కంటెంట్ వీక్షించవచ్చు. మొబైల్, వెబ్ సహా అన్ని రకాల కంటెంట్ యాక్సెస్ పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa