☼ Suryaa News
🔴 తెలంగాణ వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి
తెలంగాణ

వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి

19 Sep 2026 vikarabadraghavender

 

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబర్, 19)వరకట్న వేధింపుల  నేపథ్యంలో బీటెక్ విద్యార్థిని పల్లవి(20) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘనపూర్ లోని కేపీఆర్‌ఐటీ కళాశాలలో సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్న పల్లవికి ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డితో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో మనస్థాపానికి గురై ఈ నెల 18న కళాశాలలోని డీ బ్లాక్‌ మూడో అంతస్తు నుంచి దూకి తీవ్ర గాయాల పాలైన  పల్లవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్‌ పోలీసులు డౌరీ డెత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home