☼ Suryaa News
🔴 తెలంగాణ కొల్చారం గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: - ప్రధాన వీధులు, కాలనీల గుండా మందు పిచికారీ
తెలంగాణ

కొల్చారం గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: - ప్రధాన వీధులు, కాలనీల గుండా మందు పిచికారీ

15 Sep 2026 Reporter

కొల్చారం గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు:
- ప్రధాన వీధులు, కాలనీల గుండా మందు పిచికారీ
- గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్  ఆధ్వర్యంలో
కొల్చారం .…జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చారం మండల గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్  ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల నివారణ మందును పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా దేవన్నగారి  శేఖర్ మాట్లాడ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దోమల నివారణకు ప్రత్యేక మందును వినియోగిస్తున్నామని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత పాటించడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, వార్డు సభ్యులు కృష్ణ చింతల కృష్ణ యాదగిరి డాక్టర్ బాలరాజు ప్రవీణ్  షేకులు వనమాల శ్రీధర్ , గ్రామ ప్రజాప్రతినిధులు మహేశ్వర్ రెడ్డి దేవన్న గారి ప్రశాంత్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home