*అందినమేరకు పార్టీ స్థలంపై కన్నేసి స్థలాన్ని ఆక్రమిస్తున్న కబ్జా దారులు
*నిన్న,మొన్న ప్రభుత్వ భూములు,గూళ్లు గోపురాలు తాజాగా పార్టీ స్థలంలోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేస్తున్న దుస్థితి
*తాండూరులో ఇదేమి మాస్టర్ ప్లాన్ స్కెచ్ లు అంటూ ఆందోళన చెందుతున్న స్థానికులు
తాండూరుమేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నడిబొడ్డున ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం దినదినం అన్యాక్రాంతానికి గురవుతోంది.ఇంటి దొంగ ఈశ్వరునికి కూడా దొరకడు అన్న సామెత ఇక్కడ కనిపిస్తుంది.కొందరు నేతల అండదండలతోనే ఈ అక్రమ తతంగాలకు అంతులేకుండా పోతుందని చెప్పవచ్చు.గతంలో కొన్నేళ్ల క్రితం మాజీ మంత్రి స్వర్గీయ ఎం.మాణిక్ రావు సర్వే నంబర్ 135 నుండి దాదాపుగా 2000 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు.అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళ్ రావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.విశాలమైన ప్రదేశం నడిబొడ్డున పార్టీ కార్యాలయం కొనసాగుతుంది.పార్టీ కార్యాలయం ఆధీనంలో ఇరువైపులా దాదాపుగా 10 షాపులు,ఒక హోటల్ అద్దెకు కొనసాగుతున్నాయి వీటి నుండి ప్రతి నెల దాదాపుగా 80 వేల రూపాయలు అద్దె రూపంలో వస్తాయి.కొందరు అక్రమార్కులు పార్టీ స్థలంపై కన్నేసి ఆక్రమించుకుంటున్నారు.పార్టీ కార్యాలయం దగ్గరలోని ఒక వ్యక్తి ఉడిపి హోటల్ కోసం నిర్మాణం సాగిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చెందిన స్థలాన్ని దాదాపుగా 30 ఫీట్ల మేరకు ఆక్రమించుకున్నట్టు కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.అంతకు ముందు నడిపించిన హోటల్ వారు 25 ఫీట్ల మేరకు సెట్ బ్యాక్ లో ఉండగా ఇప్పుడు మాత్రం ఈ నిర్మాణాన్ని ముందుకు తెచ్చరూ.అంతేకాకుండా హోటల్ నుండి అండర్ డ్రైన్ పైపులను పార్టీ స్థలంలో నుండి తీసుకెళ్లి బయట ఉన్న మున్సిపల్ సైడ్ డ్రైన్ లో కలిపారు.ముఖ్యంగా ఇక్కడ ప్రారంభించనున్న ఉడిపి హోటల్ భావన నిర్మాణంలో కొన్ని లోస్కులు ఉన్నట్టు చెప్పవచ్చు.గతంలో ఇంటి నిర్మాణం కోసం మునిసిపల్ నుంచి యజమాని అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు మాత్రం కమర్షియల్ కాంప్లెక్స్ రూపంలో హోటల్ ప్రారంభించడానికి అన్ని అంగుళాలు సిద్ధం చేస్తున్నారు.ఇతర ప్రాంతానికి చెందిన వారు ఈ హోటల్ నడపడానికి సిద్ధమవుతున్నారు.రాజకీయ అండ,బడా నేతల అండదండలతో ఈ కాంప్లెక్స్ యజమాని పార్టీ స్థలం ని ఆక్రమించుకోవడం తో ఈ తతంగాన్ని చూసిన వారంతా అవాక్కవుతున్నారు.మునుముందు హోటల్ ప్రారంభమైన తర్వాత వచ్చిపోయే కస్టమర్స్ పార్టీ స్థలంలోనే వాహనాలను నిలపవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కొందరు నేతలు గగ్గోలు పెడుతున్నారు.అంతకు ముందు ఇదే స్థలంలో ఒక పార్టీకి చెందిన నేత 200 గజాల్లో కబ్జాలో ఉన్నారని ఈ కబ్జా కేసు కొన్నేళ్ల పాటు కోర్టులో నడసి కేసు తీర్పు పార్టీకి అనుకూలంగా వెలువడిందని అయితే కొందరు ట్రిక్కులు ఉపయోగించి లోస్కుల ఆధారంగా ఇతర పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆ వ్యక్తి ఇప్పుడు ఆ స్థలం నాదే అంటూ కబ్జాలో ఉన్నాడని పలువురు చెప్పారు.ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థలాన్ని ఆక్రమించుకోవడం పద్దతి కాదని అందుకుగాను కొందరు బడా నేతలు మద్దతు ఇవ్వడంతోనే ఈ అక్రమ తతంగాలు జరుగుతున్నాయని అందుకుగాను తక్షణ చర్యలుతీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కొందరు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.