☼ Suryaa News
🔴 జాతీయం ఫిన్‌టెక్, ఆటోమేషన్ రంగానికి ఐర్లాండ్ వ్యూహాత్మక కేంద్రం
జాతీయం

ఫిన్‌టెక్, ఆటోమేషన్ రంగానికి ఐర్లాండ్ వ్యూహాత్మక కేంద్రం

11 Sep 2026 vasu

ఐర్లాండ్ కాన్సుల్ జనరల్ పాట్రిక్ డఫీ
ముంబై:ఆర్థిక సేవలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలబోతతో అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ రంగానికి ఐర్లాండ్ ఒక వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తుందని ముంబైలోని ఐర్లాండ్ కాన్సుల్ జనరల్ పాట్రిక్ డఫీ స్పష్టం చేశారు. ముంబైలో ఘనంగా జరుగుతున్న 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026' సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాట్రిక్ డఫీ మాట్లాడుతూ.. గడిచిన కొన్ని రోజులుగా నిర్వహించిన జిఎఫ్‌ఎఫ్ సదస్సు ఎంతో అద్భుతంగా సాగిందన్నారు. భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), డిజిటలైజేషన్ రంగాల్లో సాధిస్తున్న పురోగతిని, అలాగే ఆర్థిక సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత అంతర్భాగంగా మారిందో ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

ఫిన్‌టెక్ విభాగానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, పరిశ్రమల భాగస్వామ్యం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఐర్లాండ్ ముందంజలో ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, రాబోయే అక్టోబర్ నెలలో ఐర్లాండ్‌లో 'గ్లోబల్ ఏఐ సమ్మిట్'ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ దిశగా గ్లోబల్ టెక్ భాగస్వామ్యాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home