☼ Suryaa News
🔴 అంతర్జాతీయం ‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి
అంతర్జాతీయం

‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి

16 Sep 2026 vasu

ఏఐ ల్యాబ్స్‌కు యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
వాషింగ్టన్: ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను నిర్మిస్తూ, ఆపై ప్రభుత్వ నియంత్రణలు కోరుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌లపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్'లో ఆయన మాట్లాడుతూ, ఏఐ కంపెనీలు తాము "ఫ్రాంకెన్‌స్టైన్" లాంటి భయంకరమైన వ్యవస్థలను సృష్టిస్తున్నామని చెబుతూనే, వాటికి తగిన రక్షణ సాధనాలను ఇతరులకు నిరాకరించడం సరికాదన్నారు.

ముందుగా ప్రమాదకరమైన మోడళ్ల నిర్మాణాన్ని ఆపాలని, ఒకవేళ తయారు చేస్తే సైబర్ దాడులు వంటి ముప్పుల నుండి ఎదుర్కొనేందుకు వీలుగా ఇతర కంపెనీలకు రక్షణ సాధనాలను (Defense tools) అందించాలని హితవు పలికారు. ప్రభుత్వాన్ని నియంత్రణలు కోరే ముందు ఏఐ ల్యాబ్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, సామ్ ఆల్ట్‌మన్, సత్య నాదెళ్ల వంటి టెక్ దిగ్గజాల మధ్య ఏఐ వేగాన్ని తగ్గించడంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home