☼ Suryaa News
🔴 అంతర్జాతీయం 35కు చేరిన మృతుల సంఖ్య
అంతర్జాతీయం

35కు చేరిన మృతుల సంఖ్య

12 Sep 2026 vasu

ఫిలిప్పీన్స్ ఫెర్రీలో దారుణ అగ్నిప్రమాదం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీలో చెలరేగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. తీవ్రమైన మంటలు, దట్టమైన పొగ కారణంగా కొద్దిరోజులుగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలగగా, మంటలను అదుపులోకి తెచ్చిన అనంతరం కోస్ట్ గార్డ్ సిబ్బంది శోధించగా 30 మృతదేహాలు నౌకలో లభ్యమయ్యాయి. మంటల తీవ్రతకు ఫెర్రీలోని బెర్త్‌లు, వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

దాదాపు 130 మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ ఫెర్రీలో ప్రమాదం జరిగిన సమయానికి 43 మంది సురక్షితంగా రక్షించబడ్డారని, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నౌకలో రెండు వరుస పేలుళ్ల కారణంగానే ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు. ఈ దుర్ఘటనతో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home