☼ Suryaa News
🔴 అంతర్జాతీయం 2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయం

2 శాతం పెరిగిన ముడి చమురు ధరలు

09 Sep 2026 vasu

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య తీవ్రతరమవుతున్న సైనిక దాడులు గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం వరుసగా నాలుగో సెషన్‌లోనూ దాదాపు 2 శాతం మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.79 శాతం ($1.76) పెరిగి $100 సమీపానికి చేరగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 1.88 శాతం ($1.75) పెరిగి బ్యారెల్‌కు $94.78 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలతో ఆగస్టు ఆరంభం నుంచి బ్రెంట్ ధరలు దాదాపు 20 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాల్లోని చమురు కేంద్రాలపై యెమెన్‌కు చెందిన హౌతీ దళాలు దాడి చేయడం, దానికి ప్రతిగా సౌదీ దళాలు వైమానిక దాడులు జరపడం ఈ తీవ్రతకు కారణమైంది. మరోవైపు, ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా డిస్ట్రాయర్లు, సైనిక స్థావరంపై క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ (IRGC) ప్రకటించింది. కాగా, తమ నౌకలపై దాడులకు తెబడితే ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేస్తామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home