☼ Suryaa News
🔴 సినిమా ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు
సినిమా

ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు

20 Sep 2026 Bangarraju

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ఈ కథకు నిజ జీవిత సంఘటనలు, కొన్ని పాత్రలు, ఫిక్షన్ మూలాలు ఉన్నాయని, తన చిన్నతనంలో అమ్మగారు తనకు జడలు వేసి పెంచిన జ్ఞాపకాల నుంచి హీరో జడల క్యారెక్టర్ ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు.

‘దసరా’ సినిమాను ఒక మంచి డ్రామాగా తీర్చిదిద్దినప్పటికీ, కమర్షియల్ మాస్ కోణంలో ప్రేక్షకులు ఆశించిన దానికంటే భిన్నమైన అనుభూతిని పొందినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈసారి ఆడియన్స్ కోరుకునే మాస్, యాక్షన్ అంశాలతో పాటు శక్తివంతమైన ఎమోషన్స్‌ను బ్లెండ్ చేసి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలో యాక్షన్ కంటే ఎమోషనే ఎక్కువగా డామినేట్ చేస్తుందని, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ప్రేక్షకులను కచ్చితంగా కనెక్ట్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, హీరోతో ఆయన వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయని శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. అలాగే సంపూర్ణేష్ బాబు హీరో ఫ్రెండ్‌గా కొత్త పర్ఫార్మెన్స్‌తో అలరిస్తారని చెప్పారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, తమద్దరి ఫ్రెండ్‌షిప్ కేమిస్ట్రీ మ్యూజిక్‌లో చక్కగా కుదిరిందని, ఇందులో బిట్ సాంగ్స్‌తో కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలిపారు.

సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేయకపోవడంపై స్పందిస్తూ, చిన్నప్పుడు మనం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఎలా సర్‌ప్రైజ్ అయ్యేవాళ్లమో, ఈ సినిమా విషయంలోనూ ఆడియన్స్ అలాగే థియేటర్‌లో సర్‌ప్రైజ్ కావాలనే ఉద్దేశంతోనే ట్రైలర్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా రీషూట్లు లేకుండా బౌండ్ స్క్రిప్ట్ ప్రకారమే 170 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని, ‘జగడం’ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యి సుకుమార్ గారి వద్ద శిష్యరికంతో ఇండస్ట్రీకి వచ్చానని శ్రీకాంత్ ఓదెల గుర్తుచేసుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

రామాయణ పార్ట్ 1 క్రేజీ అప్‌డేట్.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ ప్రాజెక్టుకు బిగ్ రన్‌టైమ్ టెస్ట్

🕑 20 Sep 2026
సినిమా

మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి

🕑 20 Sep 2026
సినిమా

మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్'

🕑 20 Sep 2026
సినిమా

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్

🕑 20 Sep 2026
సినిమా

బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో!

🕑 20 Sep 2026
సినిమా

వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

🕑 20 Sep 2026
Advertisement
↗ Full Article ← Home