☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ *వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి*
ఆంధ్రప్రదేశ్

*వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి*

15 Sep 2026 Hareesh

 

*నిమ్మాడలో కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక పూజలు*

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.

విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని ప్రార్థించారు.

గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించడం మన సంస్కృతి, సంప్రదాయంలో భాగం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే గణనాథుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వినాయక చవితి వేడుకలు ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సును నింపాలని గణనాథుని ప్రార్ధించారు.

రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎదురయ్యే అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రగతి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు సహా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించిన మంత్రి

ఈ వేడుకల్లో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్  
ఓ ఎస్ డి కింజరాపు ప్రభాకర్ గారు, గ్రామ ప్రజలు , వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home