☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి
ఆంధ్రప్రదేశ్

కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి

15 Sep 2026 Reporter

కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు
                                                                                - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి 
-ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న లోకేష్‌-
ఉషోదయ డైరీ పార్లర్‌ వద్ద మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కోవూరు క్యాడర్‌ మీటింగ్‌
-కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి రాక – స్థానిక పోరుకు ముందు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్‌
-నెల్లూరు, మేజర్ న్యూస్: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి, యువనేత  నారా లోకేష్‌ బుధవారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారని శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  తెలిపారు. మంగళవారం నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పర్యటనలో భాగంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు  కాంస్య విగ్రహాన్ని నారా లోకేష్‌ రు ఆవిష్కరిస్తారని వెల్లడించారు. అనంతరం ఉషోదయ డైరీ పార్లర్‌ ఆవరణలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే కోవూరు క్యాడర్‌ మీటింగ్‌లో పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర అనంతరం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కోవూరుకు వస్తున్న నారా లోకేష్‌కి ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఘనస్వాగతం పలకాలని శ్రేణులను ఆహ్వానించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు-ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిమహ్మద్‌ ఫరూఖ్‌ సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుందని ఎమ్మెల్యే తెలిపారు.
 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home