☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం

21 Sep 2026 Madhubabu

నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన ఎస్బీఐ బ్రాంచ్‌ను జడ్జి అమ్మన్న రాజు మరియు బ్యాంకు అధికారులు ప్రారంభించారు.
నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి అమ్మన్న రాజు, బ్యాంకు అధికారులు పాల్గొని నూతన బ్యాంక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్న రాజు మాట్లాడుతూ.. కోర్టు ప్రాంగణంలోనే నూతన బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. న్యాయవాదులు, కోర్టుకు వచ్చే కక్షిదారులు తమ బ్యాంకింగ్ అవసరాలను సులభంగా తీర్చుకునేందుకు ఈ శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. న్యాయవాదులు తమ క్లయింట్లకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు వ్యక్తిగత బ్యాంకింగ్ అవసరాలకు కూడా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి అమ్మన్న రాజు సూచించారు. కోర్టు ప్రాంగణంలో బ్యాంక్ శాఖ అందుబాటులోకి రావడంతో న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది, కక్షిదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి -రైతు సంఘం డిమాండ్

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

🕑 21 Sep 2026
ఆంధ్రప్రదేశ్

రావుస్ జూనియర్ కళాశాలలో గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలు

🕑 21 Sep 2026
Advertisement
↗ Full Article ← Home