☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

14 Sep 2026 Reporter

వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి 

రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి సీఎం చంద్రబాబు పూజలు

సూర్య, స్టేట్ బ్యూరో  : 

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకం. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home