☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కౌశలం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు-జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
ఆంధ్రప్రదేశ్

కౌశలం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు-జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

16 Sep 2026 Madhubabu

 

-నంద్యాలలో 17న ఉద్యోగ మేళా

-కౌశలం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

-జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల అర్బన్:నిరుద్యోగ యువతకు నైపుణ్యానికి అనుగుణంగా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కౌశలం పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. కౌశలం పథకం ద్వారా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా నంద్యాల జిల్లా స్వర్ణగ్రామం & స్వర్ణవార్డు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 10.00 గంటలకు నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.*

*కౌశలం పథకంలో భాగంగా నిర్వహించే ఈ ఉద్యోగ మేళాలో Dixon - Padget Electronics - Ausar HR Services సంస్థలో Laptop Assembly and Production Associate ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. Any Degree, B.E., Diploma, ITI (Pass/Fail) విద్యార్హతలు కలిగి, 19 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.*

*ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు Resume/CV, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా kaushalam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.*

*కౌశలం పథకం ద్వారా యువతలోని నైపుణ్యాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత తమ అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అవకాశాలను పొందేందుకు కౌశలం వేదికను వినియోగించుకోవాలని, ఉద్యోగ మేళాకు అధిక సంఖ్యలో హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కోరారు.*

*డిఐపిఆర్ఓ, నంద్యాల ద్వారా జారీ*

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home