☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ మాట ఇస్తే తప్పను.. చెప్పిన ప్రతి మాటను చేసి చూపిస్తా
ఆంధ్రప్రదేశ్

మాట ఇస్తే తప్పను.. చెప్పిన ప్రతి మాటను చేసి చూపిస్తా

20 Sep 2026 prakasamsuryaa

మాట ఇస్తే తప్పను.. చెప్పిన ప్రతి మాటను చేసి చూపిస్తా

- మోపాడు రిజర్వాయర్‌కు వెలుగొండ జలాలు తీసుకొస్తా

- వెలుగొండ ప్రాజెక్టు జలాలతో ప్రతి ఇంటికీ తాగునీరు

- ఈ నెల 30న రూ.వెయ్యి కోట్లతో ట్రిపుల్‌ఐటీకి శంకుస్థాపన

- స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీని గెలిపిద్దాం

- కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

పామూరు, సూర్య ప్రతినిధి : 

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని మాట ఇస్తే తప్పనని చెప్పిన ప్రతి మాటను చేసి చూపిస్తానని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో పామూరు పట్టణ మేజర్‌ పంచాయతీ వైసిపి యువ నాయకుడు మేజర్ పంచాయతీ మాజీ ఉప సర్పంచి యాదాల వెంకట సాయి కిరణ్ నేతృత్వంలో ఆయన అనుచరులతో కలిసి సుమారు 200 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడారు.స్థానిక ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం పామూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు.వెలుగొండ ప్రాజెక్టు నుంచి మోపాడు రిజర్వాయర్‌కు నీటిని తీసుకొస్తామని 2029లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మోపాడు రిజర్వాయర్‌కు నీరు అందిస్తామని తెలిపారు. ఏడాదిలో వెలుగొండ జలాలతో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 30న రూ.వెయ్యి కోట్ల నిధులతో అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ట్రిపుల్‌ఐటీకి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హాజరవుతున్నారన్నారు. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి కనిగిరి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కనిగిరి వరకు నిరంతర రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. తన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని, అభివృద్ధి చేసే టీడీపీలో ఉండడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరడం పట్ల ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, ఇరిగినేని రవీంద్ర, యాదాల వెంకట సాయి కిరణ్, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, యారవ శ్రీనివాసులు, అడుసుమల్లి ప్రభాకర్, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, మల్లెబోయిన బాల బ్రహ్మయ్య, ఉప్పలపాటి హరిబాబు, పాలపర్తి వెంకటేశ్వర్లు, మోరుబోయిన నరసింహారావు, బైరెడ్డి జయరామిరెడ్డి, సయ్యద్ అమీర్ బాబు, షేక్ గౌస్ బాషా, చల్లా సుబ్బారావు, ఉసా మధు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home