☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట
ఆంధ్రప్రదేశ్

వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట

13 Sep 2026 Reporter

వినాయకచవితి శుభాకాంక్షలు 

ఎంపీ  మాగుంట
    విఘ్నాలకు – సకల దేవగణాలకు అధిపతి, అన్ని శుభకార్యాలలో తొలి పూజ అందుకొనే వినాయకస్వామి భాద్రపద మాసం చతుర్ధి నాడు జన్మించినందున ఆ రోజును దేశ ప్రజలు  వినాయకచవితిగా జరుపుకొంటారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ప్రజల్లో జాతీయ స్పూర్తిని  పెంపొందించుటకు సామూహిక గణపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడంజరిగింది.  విఘ్నేశ్వరస్వామిని ప్రార్ధించడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా సకల కార్యసిద్ధి జరిగి మనకు ఆనందమయ జీవితం ప్రాప్తించును. 
    కనుక, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజలు మట్టితో చేసిన విఘ్నేశ్వరస్వామిని నవరాత్రులు నిష్టతో  పూజించి, ఈ పండుగను సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని కోరుచూ‌ ఒంగోలు పార్లమెంట్ సభ్యలు  మాగంట  శ్రీనివాసులరెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home