☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఏలూరి మాధవరావు సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్

ఏలూరి మాధవరావు సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లు పంపిణీ

16 Sep 2026 Reporter

ఏలూరి మాధవరావు సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లు పంపిణీ

- రేణిమడుగు గ్రామస్తులకు 20 లీటర్ల వాటర్ క్యాన్లు ఉచితంగా అందజేత

పామూరు, సూర్య ప్రతినిధి :  మండలంలోని కంబాలదిన్నె పంచాయతీ పరిధిలోని రేణిమడుగు గ్రామంలో టిడిపి కంబాలదిన్నే పంచాయతీ తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు(కోటయ్య) తన సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లను ఉచితంగా పంపిణీ చేశారు. 20 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ క్యాన్లను గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందజేసి తాగునీటి అవసరాలకు తనవంతు సహకారం అందించారు.

యస్ ఎల్ వి  సేవా సమితి ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాధవరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కంబాలదిన్నె పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మన్నం రమణయ్య, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు గద్దె గంగయ్య, రేణిమడుగు చెరువు చైర్మన్ గద్దె మోహన్, బూత్ ఇన్‌చార్జి కమ్మ బాలకృష్ణ, కమ్మ వెంకటేశ్వర్లు, గద్దె వెంకటేశ్వర్లు, కమ్మ మాధవరావు, వింజం కేశవులు, తలపనేని నరసింహం, మారుపాకుల హాజరత్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home