☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్

అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి

12 Sep 2026 Reporter

9వ జాతీయ పోషణ మాసోత్సవాలలో  భాగంగా మూడవ రోజు సూపర్వైజర్ లక్ష్మిదేవి అధ్యక్షన్తన  గొల్లదాని మండపం సెక్టర్, ముత్యాల చెరువు సెక్టార్, కుటాగుల్ల-2 కేంద్రం లో అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ రాధిక ముఖ్య అతిథిగా హాజరై గర్భవతులు బాలింతలకు పలు సూచనలు చేశారు. పోషణ మాసోత్స వాల కార్యక్రమాన్ని ఈనెల 9వ నుంచి ప్రారంభించడం జరిగిందని తెలి పారు.కార్యక్రమంలో నెల రోజులపాటు గర్భవతులు, బాలిం తలు, చిన్నారులు, కిశోర బాలికలకు, పోషకాహారం, ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత పై కార్య క్రమాలపై అవగా హన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  అంగన్వాడి కేంద్రాల ద్వారా సమతుల్య ఆహారం, అధికంగా ప్రోటీన్స్ ఉండే ఆహారంతీసుకోవాలని సూచించారు. అయోడిన్ ఉప్పు, పప్పు, నూనె వినియోగంపై అవగాహన కల్పిం చారు.  ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బాలల ఎదుగుదల, తల్లి ఆరోగ్యంగా ఉంటారని సూచిం చారు. ద్వారా తల్లి బిడ్డఆరోగ్యవంతులుగా మెలుగుతా రన్నారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్య కర్తలు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home