☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ గురజాడ ఆశయాలను ఆచరణలో పెడదాం - ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేద్దాం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
ఆంధ్రప్రదేశ్

గురజాడ ఆశయాలను ఆచరణలో పెడదాం - ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేద్దాం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

21 Sep 2026 Madhubabu

*పత్రికా ప్రకటన*

*సమాజ సంస్కరణకు గురజాడ రచనలు చిరస్థాయి స్ఫూర్తి*

 

-తరతరాలకు స్ఫూర్తినిచ్చే మహాకవి గురజాడ - ఘనంగా 164వ జయంతి వేడుకలు

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

*నంద్యాల అర్బన్:మహాకవి గురజాడ వెంకట అప్పారావు సాహిత్యం నేటికీ సమాజంలో చైతన్యం, సంస్కరణలకు స్ఫూర్తినిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గురజాడ రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’, ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ వంటి రచనలు బాల్య వివాహాలు, సామాజిక రుగ్మతలు, మహిళల సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించాయని కలెక్టర్ తెలిపారు. విజయనగరం జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, అక్కడ గురజాడ 150వ జయంతి వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం తనకు లభించిందన్నారు. గురజాడపై సేకరించిన సమాచారంతో కవులు, రచయితల వ్యాసాలతో పుస్తకాలను రూపొందించి గ్రంథాలయాలకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. దేశమును ప్రేమించుమన్నా గేయంలోని సందేశం నేటికీ ఎంతో ప్రాసంగికమని, ముఖ్యంగా ముందుకు సాగాలనే గురజాడ ఆశయం పరిపాలనలోనూ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. గతంలో పనులు జరగలేదని నిరుత్సాహపడకుండా, అనుభవాలను పాఠాలుగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా నిస్వార్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రామునాయక్, జిల్లాధికారులు, సిబ్బంది పాల్గొని గురజాడ అప్పారావుకు ఘనంగా నివాళులర్పించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home