గతంలో బుడమేరు వరదల కారణంగా విజయవాడ నగరం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆక్రమణల వల్లే ఈ విపత్తు తలెత్తిందని గుర్తించిన ప్రభుత్వం, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, కొందరు ఆక్రమణదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ప్రక్రియకు కొంత ఆటంకం ఏర్పడింది.
తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, బుడమేరు ఆక్రమణలపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కొత్తగా అక్రమ నిర్మాణాలకు తావు ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.