బీటీ రోడ్డు నిర్మాణానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గురువారం మధ్యాహ్నం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి మండలం మాముడూరు గ్రామంలో ఆయన గ్రామం నుంచి 44వ నెంబర్ జాతీయ రహదారిని కలిపే బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆయన భూమి పూజ నిర్వహించారు. రెండు కోట్ల 83 లక్షల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్