మంగళవారం రాత్రి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ చాణక్యపురి కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంజయ్ కుమార్ యాదవ్ (21) అనే యువకుడి వద్ద 110 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, వేజింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని విక్రయించడానికి సిద్ధం చేసి ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి సరఫరా, విక్రయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa