TG: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేసేలా రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతున్నాయని అధికారులు సూచించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్‌తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa