తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఎన్నికల్లో సందడి మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వి. వెంకటాయపాలెంలో ఓ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొని మంత్రి ఈ ప్రకటన చేశారు. దీని వల్ల ఎన్నికల్లో ఖర్చు చాలా వరకు తగ్గుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa