గ్రామ పంచాయతీలు లేదా వార్డుల సంఖ్య తక్కువగా ఉన్నచోట, ముందుగా మహిళా రిజర్వేషన్లను నిర్ణయించి, ఆ తర్వాత లాటరీ పద్ధతిలో మిగిలిన రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలకు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు పునాది కానుంది. డిసెంబర్ తొలివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa