శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ రమేష్ నాయుడు నేతృత్వంలోని సమావేశంలో ప్రత్యేక దర్శన టికెట్ కొనుగోలు చేసే భక్తులకు ఉచిత లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించారు. డిసెంబరు 1 నుంచి రూ. 500 స్పర్శ దర్శనానికి 2 లడ్డూలు, రూ. 300 సర్వదర్శనానికి ఒక లడ్డు ఇవ్వనున్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం బాక్సులు, హెల్ప్‌లైన్, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజు సర్వ దర్శనం కల్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa