హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయి.. ఓ బాలుడికి జన్మనిచ్చింది. అయితే కరీంనగర్‌కు చెందిన దంపతులకు రూ.6 లక్షలకు ఆమె తమ బాలుడిని విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ విషయం బాలల పరిరక్షణ కమిటీకి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి బాలుడిని స్వాధీనం చేసుకుని, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న 15 మందిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa