ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 03:52 PM

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు పెద్దమందడి మండల స్థాయిలో చెకుముకి పరీక్షలు నిర్వహించారు. తెలుగు మీడియంలో మొజర్ల-మద్దిగట్ల ప్రథమ, మనిగిళ్ళ ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో జగత్ పల్లి ప్రథమ, బలిజపల్లి, పెద్దమందడి ఉన్నత పాఠశాలలు ద్వితీయ స్థానాలు సాధించాయి. మండల విద్యాధికారి మంజులత విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa