TG: తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలో గల అంజనాజపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, పల్లిపాడు -ఏన్కూర్ మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహంలో ఓ డీసీఎం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ గల్లంతు అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa