TG: హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ సృష్టించాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది టవర్ ఎక్కిన వ్యక్తిని సురక్షితంగా క్రిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. టవర్ ఎక్కిన వ్యక్తి డిమాండ్ ఏంటో తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa