సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్కుల శివారెడ్డి ఇటీవల సీసీఐ కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రైతులకు, వ్యాపారులకు అనుసంధానంగా ఉండి రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఏంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa