పెద్దపల్లి ఎమ్మెల్యే కొప్పుల విజయరమణరావు శుక్రవారం ఓదెల మండలం గుండ్లపల్లి, కనగర్తి, పిట్టల ఎల్లయ్యపల్లి, హరిపురం గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa