మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ, ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ఫరూఖ్ నగర్ సమావేశంలో నిర్ణయించారు. దాడి ఘటనను సుమోటోగా తీసుకొని, అడ్వకేట్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఈ ఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ ఫరూఖ్ నగర్ అధ్యక్షులు జోగు నాగ భూషణ్ మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa