వేములవాడ మండలం నమిలికొండపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి వంగపెళ్లి సాయి మణి వర్మ 2022–23 రాష్ట్రపతి అవార్డును అందుకుని జిల్లాకు గౌరవం తెచ్చారు. సి.ఎం.ఆర్. కాలేజీలో చదువుతున్న సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నందుకు ఆయన ఈ గౌరవానికి ఎంపికయ్యారు. సిరిసిల్లలో కుమ్మరి కుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శనివారం ఘన సన్మానం నిర్వహించారు. యువత సేవా భావంతో ముందుకు సాగాలని, సాయివర్మ జిల్లా గౌరవాన్ని పెంచారని కుమ్మరి సంఘ నాయకులు కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa