జి.సిగడాం మండలంలోని దవళపేట కూడలి వద్ద మంగళవారం భారీలోడుతో వెళ్తున్న లారీ కూరుకుపోయింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనాల రాకపోకలు స్తంభించపోవడంతో ప్రయాణికులు,వాహనచోదకులు అవస్థలకు గురయ్యారు. దవళపేట కూడలి వద్ద చిలకపాలెం-రాజాం ప్రధాన రహదారికి సంబందించిన కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఇరువైపుల నుంచి వచ్చిన వాహనాలు రాకపోకలు సాగించేందుకు డైవర్షన్ రోడ్డు ఏర్పాటుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa