CSK vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా.. బౌలింగ్ ఎంచుకుంది!
 

by Suryaa Desk | Tue, Apr 14, 2026, 08:40 PM

చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.గత మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా తమ ప్రదర్శనపై జట్టుకు సంతృప్తి ఉందని రహానే తెలిపారు. అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో బలమైన ఆరంభం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. టీమ్ కాంబినేషన్ సంతృప్తికరంగా ఉందని, చిన్న చిన్న అంశాల్లో మెరుగుదలతో విజయం సాధించవచ్చని చెప్పారు. ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని, నవదీప్ సైని స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారని వెల్లడించారు.మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అన్నారు. చెపాక్ పిచ్‌లో పెద్దగా మార్పులు లేవని, స్కోరింగ్ కొంత కష్టమైనప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. గత మ్యాచ్‌లో 210 పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేసిన తమ బౌలింగ్ యూనిట్‌పై నమ్మకం పెరిగిందని చెప్పారు. అలాగే ఫీల్డింగ్ ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు.పాయింట్ల పట్టికలో దిగువ స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, నవదీప్ సైని, మ్యాథ్యూ షార్ట్, అకేల్ హొసేన్, మ్యాట్ హెన్రీ తదితరులు జట్టులో భాగమయ్యారు.
*తుది జట్లు:కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్ర్కిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
*చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
*ఇంపాక్ట్ ప్లేయర్స్:
-KKR: ఫిన్ అలెన్, మనీశ్ పాండే, తేజస్వి దహియా, టిమ్ సీఫర్ట్, నవదీప్ సైని
-CSK: మ్యాథ్యూ షార్ట్, అకేల్ హొసేన్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ


 

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM