12.04.2026 నుండీ 18.04.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Mon, Apr 13, 2026, 12:48 PM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)ప్రారంభంలో వృత్తి విద్య విషయాల కొరకు శ్రద్ధ, శ్రమ అధికం. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో మార్పులు నిర్ణయాలు. మధ్యలో ఆశించిన ఫలితాలు అనుకూలం, నెట్వర్క్ పెంచుకుంటారు, మీడియా , కమ్యూనికేషన్, దూర ప్రదేశాలలో వృత్తి, ఆర్థిక అంశాలు వృద్ధి, మిత్రులతో చర్చలు, బంధు వర్గం కలయిక. అనుభవజ్ఞుల సలహాలుఉపకరిస్తాయి. పోటీలలో అనుకూలం. నిద్రలేమి, ప్రయాణాలు, అసౌకర్యాలు ఆకస్మిక ఖర్చులు ఇబ్బంది పడతాయి. కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారాంతంలో నాయకత్వ లక్షణాలు, క్రియేటివిటీ ధైర్య సాహసాలు, వ్యక్తిగత శ్రద్ధ ఆకర్షణ పెరుగుతాయి. ”హనుమాన్ చాలీసా మేలు”


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


ప్రారంభంలో సామర్ధ్యాన్ని ఉపయోగించి అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నలు. ప్రయాణాలకు అవకాశం. పెద్దల సహకారం. గృహపరమైన, వృత్తిలో ఆగిన కార్యక్రమాలని కుటుంబ సభ్యుల సహకారంతో, ప్రభుత్వ, రాజకీయ వ్యక్తుల సలహాలతో పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు, ఆదాయవృద్ధి, వ్యాపార వ్యవహారాలు, భూసంబంధ అంశాలు పూర్వం మీద కొంత అనుకూలం. ఎదురు చూసిన ఆకస్మిక లాభాలు అందుకుంటారు,నూతన వృత్తులకు అవకాశం. తోబుట్టువుల సహకారం. వ్యక్తిగత ఆరోగ్య రీత్యా, గృహ అంశాల కొరకు, ముఖ్య విషయాలకై ఖర్చులను ప్రణాళికా పరంగా అంచనా మంచిది. ఆదిత్య హృదయ పారాయణ మేలు.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ జాగ్రత్తలు, ఆరోగ్య విషయాలు శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాలలో, ఆకస్మిక ఖర్చులలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఉన్నత విద్య, దూర ప్రయాణాలలో మంచి నిర్ణయాలు. గురువులు  అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం, సహకారం. వృత్తిపరంగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ మంచి ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయం. నూతనవృత్తులు కొరకు ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. ఆర్థికంగా అనుకూలం. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ బాగుంటుంది. వారాంతం అన్ని విషయాలలో, అభివృద్ధి, శుభవార్త, అనుకూలత. దుర్గా దేవి ఆరాధన మంచిది .


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


ప్రారంభంలో గుర్తింపు గౌరవం, స్నేహ సంబంధాల వృద్ధి. జీవిత భాగస్వామితో అనుకూలం. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ, ఖర్చులు, కుటుంబ సభ్యులతో, ఆర్థిక విషయాలలో చిన్నపాటి ఘర్షణ అధిగమించాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ముఖ్య విషయాలు తాత్కాలిక వాయిదా. ఆధ్యాత్మిక విషయాలలో, కమ్యూనికేషన్ లో, ప్లానింగ్ అపరోధాలు. క్రింద పనిచేసే సిబ్బంది సహకారం సామాన్యం. అభివృద్ధికి, మనశ్శాంతికి ఆటంకపరిచే ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారాంతంలో వృత్తి, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక విషయాలు మంచి మార్పులతో అనుకూలం. ఇష్టదేవత ప్రార్థన మేలు.


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


ప్రారంభంలో ప్రత్యర్థుల మీద విజయం కొరకు, పూర్వపు రుణములు తీర్చుటకు, కుటుంబ సభ్యుల ఆరోగ్యఅంశాల పైశ్రద్ధతో ఖర్చులు అధికం చేస్తారు. స్థిరాస్తుల పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. నిద్రలేమి అనుకోని ప్రయాణాలు. సాంఘిక సంబంధాలు అనుకూలం. సోషల్ మీడియాలో నూతన వ్యక్తుల పరిచయాలు, వ్యాపార అభివృద్ధి కొరకు ఖర్చులు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక అనుకూలతల కొరకు, నెట్వర్క పెంపొందించుకుంటారు. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వాగ్వాదాలకు, విమర్శలకు, ఒత్తిడికి దూరంగా ఉండాలి.  వారాంతంలో నాయకత్వ లక్షణాలు, మిత్రుల సహకారం, ఉత్సాహంగా ఉంటారు. సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో సంతాన వర్గం, ప్రియమైన వ్యక్తులతో విందు వినోదాలు ఆహ్లాదకరమైన వాతావరణం అవకాశం. అయినప్పటికీ మానసిక ప్రశాంతత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఆత్మీయులతో పౌరుషంతో మాట పట్టింపులకు, వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణ కొరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తి సామాన్యం. నూతన వృత్తులకు , ఇంటర్వ్యూలకు అవకాశం. విద్యార్థులు పోటీలలో విజయం కొరకు శ్రమ అధికం. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ. కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. సంతానవృద్ధి. వారాంతం ఆర్థిక , కుటుంబఅంశాలు ఆకస్మిక అనుకూలం. కంటి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. కృష్ణుని ఆరాధన మేలు.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడి, గృహ సంబంధ అంశాల, కుటుంబ వ్యవహారాలు మీద ఏకాగ్రత తక్కువ. సంతాన విషయాల మీద, ముఖ్యంగా వారి ఉన్నత విద్య, అభివృద్ధి కొరకు తీసుకొని నిర్ణయాలలో కొలీగ్స్ తో, గురువులతో, కుటుంబ పెద్దలతో సంప్రదింపులు చేస్తారు. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. విద్యార్థులు పోటీలలో శ్రమతో మంచి విజయాలు సాధిస్తారు. వృత్తిలో పెద్దల సహకారం, బంధు వర్గంతో అనుకూల చర్చలు, భూమి రుణముల కొరకు ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు. మాట విలువ, పౌరుషం పెరుగుతుంది. వృత్తిలో శ్రమకి తగిన ఫలితాలు సాధిస్తారు. వారాంతంలో సంఘంలో గుర్తింపు గౌరవం, ఆర్థిక లాభాలు, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన మేలు.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


ప్రారంభంలో సామర్థ్యంతో, పుణ్య బలంతో, వ్యక్తుల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేయడానికి శాయా శక్తుల ప్రయత్నాలు చేస్తారు. నిర్ణయాలలో ఆలస్యాలు, కమ్యూనికేషన్ లో అవరోధాలు, మానసిక ఉద్వేగాలు అధికం. స్థిరాస్తుల విషయంలో, గృహ వాహనాలకు సంబంధించిన అంశాలలో సంబంధిత వ్యక్తులతో చర్చలు. ఆకస్మిక అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. తల్లి ఆరోగ్యం, వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధ అవసరం. విద్యార్థులు విద్య పై శ్రద్ధ వహించాలి, లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి. అనవసర విషయాలకి దూరంగా ఉండాలి. సృజనాత్మకత, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలి. హయగ్రీవ జపం మేలు చేస్తుంది. వారాంతం వృత్తి, ఆరోగ్యం, ఆశించిన విషయాలు విజయం. దత్తాత్రేయ ఆరాధన మేలు.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ప్రారంభంలో కుటుంబ వ్యవహారాల, స్థిరాస్తుల కొరకు ఆకస్మిక ఖర్చులు. ఆత్మీయులతో అనవసర ఘర్షణలకు, ఆకస్మిక వాగ్వాదాలకు తావు ఇవ్వరాదు. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో వ్యక్తుల సహకారంతో, సామర్థ్యాన్ని ఉపయోగించి పనులు పూర్తి చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అంశాలు , విద్యా అభివృద్ధి కొరకు, ఖర్చులు ఆలోచన చేస్తారు. తల్లితండ్రుల ఆరోగ్యం కొరకు సౌకర్యాలు, సంతానం, భూమికి సంబంధించిన అంశాలు భాగస్వామితో చర్చిస్తారు. వారాంతంలో విందు వినోదాలు పాల్గొంటారు, రావలసిన ధనం కొంతమేర ఆకస్మికంగా అందుతుంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. నూతన ఆహ్వానాలు అందుకుంటారు. సూర్య ఆరాధన మేలు


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


ప్రారంభంలో మానసిక ప్రశాంతత నూతన ఉత్సాహం. భాగస్వామ్య వ్యవహారాలు, సాంఘిక సంబంధాలు గుర్తింపు గౌరవం అనుకూలిస్తాయి. లక్ష్యసాధన దిశగా చేసే ప్రయత్నాలు, వ్యాపార, రాజకీయ కలిగిన వ్యక్తుల సహకారంతో పూర్తి చేసుకుంటారు. అధిక ఆత్మవిశ్వాసం వలన, ఆర్థిక అంశాలలో, మాటలలో చిన్నపాటి అపార్థాలకు అవకాశం. సమయస్ఫూర్తిగా సమస్యలను అధిగమిస్తారు. చక్కని సామర్థ్యంతో, పరాక్రమంతో, నూతన శక్తితో పనులన్నీ ప్రణాళికా పరంగా అనుకున్న సమయానికి పూర్తి. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ లో తగిన జాగ్రత్తలు అవసరం. వారాంతంలో విద్యార్థులు, వాహనములు నడుపువారు, ఉద్యోగస్తులు వారి మార్గాలలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సత్యనారాయణస్వామి ఆరాధనమేలు.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభంలో ఆరోగ్య , న్యాయ సంబంధ అంశాలు కొరకు ఖర్చులు. విద్యార్థుల అధిక శ్రమతో పోటీలలో విజయం కొరకు ప్రయత్నాలు. నూతన రుణముల కొరకు యత్నాలు. గౌరవం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మంచి ఆలోచనలను, ఆధ్యాత్మిక స్నేహ సంబంధాలను సద్వినియోగ పరుచుకోవాలి. ఆందోళనను అధిగమించాలి. మాటల వల్ల, ఆర్థిక అంశాలలోనూ, వాగ్దానాలలోనూ ఉద్వేగాల వల్ల ఆలస్యాలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి విషయాలలో, పై అధికారులతో వ్యవహరించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగవు. వారాంతంలో కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక అంశాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా మేలు.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో సంతానంతో అనుబంధము, ఆధ్యాత్మిక విషయాలు, స్నేహ సంబంధాలు అనుకూలం. అయినప్పటికీ అధిక ఆత్మవిశ్వాసం తో తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమైన విషయాల్లో వాయిదాలు, ఆరోగ్య ఇబ్బంది చికాకును కలిగిస్తాయి. స్వదేశన్ని సందర్శించడానికి ప్రయాణం కొరకు ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తుల పెట్టుబడి, విదేశీ ప్రయాణాలు కొరకు  నిర్ణయాలలో ఆత్మీయులని సంప్రదించటం మేలు. వ్యాపార వ్యవహారాలలో, ఆరోగ్య అంశాలలో, తోబుట్టువుల చర్చల యందు శ్రద్ధ అవసరం. వారాంతంలో కంటి ఆరోగ్య శ్రద్ధ, పెద్దలతో, పలుకుబడి కలిగిన ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వినయంతో పనులు నిర్వర్తించుకోవాలి. సూర్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన మేలు.


 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


 


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com

Latest News
Late Bellerin goal all but ends Real Madrid's La Liga title hopes Sat, Apr 25, 2026, 10:29 AM
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM