|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 01:47 PM
వత్సవాయి మండలం వేముల నర్వలో ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన 400 మీటర్ల సీసీ రోడ్లను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రారంభించారు. పాత వేములనర్వ, కొత్త వేములనర్వ గ్రామాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ రోడ్డును నిర్మించారు. దాత మాధవరావు ఇచ్చిన స్థలంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు వడ్లమూడి రాంబాబు, చిత్తూరు రమేష్, పెద్ది రామారావు తదితరులు పాల్గొన్నారు.
Latest News