|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 02:22 PM
మార్చి 22న రాజ్‌కోట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక ఆన్‌లైన్ మీడియా జర్నలిస్టును అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారనే వార్తలపై NHRC సీరియస్ అయ్యింది. జర్నలిస్టును వివస్త్రుడిని చేసి, తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టారని, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చుకోవద్దని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలను సుమోటోగా స్వీకరించిన NHRC, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని గుజరాత్ DGPకి నోటీసులు జారీ చేసింది.
Latest News