|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 04:31 PM
ఇటీవల ఏపీలోని కర్నూలు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో జరిగిన బస్సు ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం బస్సు ప్రమాదాల నివారణపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే రాష్ట్రంలో టాక్సేషన్ ఎక్కువగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు రాష్ట్రంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. త్వరలో బస్సుల్లో సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేస్తాం’ అని తెలిపారు.
Latest News