|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 03:26 PM
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. హీట్‌వేవ్ పరిస్థితుల వలన చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు.ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఏప్రిల్, మే, జూన్ నెలలలో హీట్ వేవ్ ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ పరిస్థితులను ప్రజలు చవిచూస్తున్నారని తెలిపారు.ఎండకాలంలో వదులుగా ఉండే దుస్తులే ధరించాలి.ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్, తలకు క్యాప్, ముఖానికి స్కార్ఫ్ పెట్టుకోవాలి.తరచూ నీళ్లు తాగుతుండాలి.మసాలాలు ఉండే పదార్థాలు, నూనె ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడ ఉంటే మంచింది.పళ్ల రసాలు తాగుతూ ఉండాలి.ప్రధానంగా శరీరం లవణాలను కోల్పోకుండా కాస్త ఉప్పు వేసిన ద్రవపదార్థాలు తీసుకోవాలి.వేసవిలో కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి బొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది.
Latest News